మండిపోతోందని.... బీర్లు బాగా తాగేశారు

byసూర్య | Thu, Jun 01, 2023, 04:52 PM

వేడినుంచి ఉప సమనం  కోసం చల్లగా తాగడం అందరికీ అలవాటే. కానీ మనవాళ్లు చల్లదనం కోసం  ఏకంగా బీర్లనే ఫుల్ గా తాగేశారు. 'తెలంగాణలో తాగుడు వ్యసనం కాదు. అలవాటు పడిన ఓ సంప్రదాయం.' ఇటీవల విడుదలైన ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. ఆ డైలాగ్‌ను మన మందుబాబులు స్పూర్తిగా తీసుకున్నట్లుంది. ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో బీర్లు తాగేశారు. గత రికార్డులను తిరగరాస్తూ.. ఏకంగా నెల రోజుల వ్యవధిలో 7.44 కోట్ల బీర్లను మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు. మే నెలలో ఎండలు విపరీతంగా ఉండటం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావటంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.


ఒక్క మే నెలలోనే రికార్డు స్థాయిలో 7.44 కోట్ల బీరు సీసాలు అమ్ముడైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 2019 మే నెలలో రికార్డు స్థాయిలో 7.2 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. తాజాగా.. ఆ రికార్డును బద్దలు కొడుతూ తెలంగాణలోని మందుబాబులు 7.44 కోట్ల బీర్లు మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు. ఎండలు దంచి కొట్టడం, పెళ్లి వంటి శుభకార్యాలు ఉండటంతో బీర్ల సేల్స్ పెరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ అధికారి వెల్లడించారు. అయితే కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్‌లో అమ్ముడు పోతే మొత్తం మధ్యం అమ్మాకలు ఏ రేంజ్‌లో ఉంటాయోనని పలువురు ఆశ్చర్యపోతున్నారు.


తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. ఇందులోనూ మద్యం సరఫరా ఉంది. వీటి ద్వారా రోజుకు రూ.90 నుంచి రూ.100 కోట్లు విలువైన మద్యం సేల్ అవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.35,145.10 కోట్లు విలువైన 3.52 కోట్లు లిక్కర్‌ కేసులు, 4.79 కోట్లు బీరు కేసులు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం తాగే మందుబాబుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో మద్యం ఆదాయం కూడా పెరుగుతోంది.Latest News
 

ముండ్రాయిలో డిసిసిబి బ్యాంకు ప్రారంభం Sat, Sep 30, 2023, 02:09 PM
ఎవ్వరికి భయపడను: ఎమ్మెల్యే గువ్వల Sat, Sep 30, 2023, 02:08 PM
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్... Sat, Sep 30, 2023, 01:53 PM
చేతన్ శ్రీ తేజ కు ఎల్ఓసి పత్రం అందజేసిన ఎమ్మెల్యే Sat, Sep 30, 2023, 01:51 PM
కళ్యాణలక్ష్మి చెక్కులు అందించనున్న ఎమ్మెల్యే Sat, Sep 30, 2023, 01:50 PM