byసూర్య | Fri, Mar 31, 2023, 10:04 PM
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం చేశాయి. పంటదెబ్బతిని రైతులు నష్టపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో భారీ వర్షం కురిసింది. శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాటు చేసిన చలువ పందిర్లు చెల్లాచెదురయ్యాయి. గాలి వాన వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో వడగండ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది.