పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం

byసూర్య | Wed, Mar 29, 2023, 09:12 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక యాద్రాది దేవాలయానికి ఎనలేని ఆదరణ పెరుగుతోంది. ఇదిలావుంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు, హుండీ ఆదాయం సైతం గణనీయంగా పెరిగింది. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు వేస్తున్నారు. వీటితో పాటు టికెట్లు, ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత  2022– 23లో ఆలయం వార్షిక ఆదాయం రూ.169 కోట్లకు చేరుకుంది. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన కొత్తలో ఆలయ వార్షిక ఆదాయం రూ. 61 కోట్లు ఉండగా.. అది ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. 


టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2021-22 ఏడాదిలో దాదాపు 73 లక్షల మంది వచ్చేవారని, ఆలయ పునరుద్ధరణ తర్వాత అనేక సౌకర్యాలు కల్పించడంతో భక్తుల సంఖ్య  86 లక్షలకు చేరుకుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1200 కోట్లు వెచ్చించి ఆలయాన్ని తీర్చిదిద్దింది. రవాణా, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడం, హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో సాధారణ రోజుల్లో రోజుకు ఐదు వేల మంది.. వారంతాల్లో 40 వేల మంది వరకు దర్శనానికి వస్తున్నారని అధికారులు తెలిపారు.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM