సకల సౌకర్యాలతో ముందుకు కదిలిన ‘భారత్ గౌరవ్’ రైలు

byసూర్య | Sun, Mar 19, 2023, 09:50 PM

సకల సౌకర్యాలతో సికింద్రాబాద్ నుంచి తొలిసారి ఓ ‘భారత్ గౌరవ్’ రైలు బయలుదేరింది. దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 26 వరకు అంటే 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది. యాత్రలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యకేత్రాల సందర్శన ఉంటుంది. 


తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో ఆగుతుంది. ఇందులోని ప్రయాణికులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. ఈ రైలులో ప్రయాణించే యాత్రికులకు కూచిపూడి నృత్యంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌, ఎండీ రజనీ హసీజా, ఇతర అధికారులతో కలిసి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ యాత్రికులకు స్వాగత కిట్‌లు అందజేశారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM