మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత

byసూర్య | Sun, Mar 19, 2023, 08:46 PM

మిల్లెట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న పీవీ సతీష్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పీవీ సతీష్ అంత్యక్రియలు మార్చి 20న ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డిలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పీవీ సతీష్ అసలు పేరు పెరియపట్నం వెంకటసుబ్బయ్య సతీష్. 1945 జూన్ 18న మైసూర్‌లో జన్మించిన ఆయన హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు.సంగారెడ్డి జహీరాబాద్ జిల్లా కేంద్రంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. పప్పు దినుసుల సాగు, వినియోగం పెంచడం, సేంద్రియ వ్యవసాయంపై సతీష్ నాలుగు దశాబ్దాలుగా కృషి చేశారు.  


Latest News
 

కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు Thu, Sep 28, 2023, 08:55 PM
ఘనంగా ఖైరతాబాద్‌ గణేశుడు నిమజ్జనం Thu, Sep 28, 2023, 02:51 PM
నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
మార్చని ఇంటి నంబర్ లు. పెరిగిన ఓటర్ల సంఖ్య Thu, Sep 28, 2023, 01:52 PM