టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవాలి: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

byసూర్య | Sun, Mar 19, 2023, 05:16 PM

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో నాకు వ్యక్తిగత వైరం ఏమీ లేదని అన్న ప్రవీణ్ కుమార్.. యూనివర్సిటీలో ఆయన తనకు సూపర్ సీనియర్ అని చెప్పారు. గురుకుల సెక్రెటరీగా ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా ఆయన్ను చాలాసార్లు కలిశాని అన్నారు. కానీ పేపల్ లీక్ అనేది క్షమించరాని నేరమని..,పేపర్ లీక్ లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలో పడేసిందని చెప్పారు. అందువల్ల దయచేసి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోండి సార్.. అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.


ఇదిలా ఉండగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంపై నిన్న సీఎం కేసఆర్‌కు నివేదిక ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని.., ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల పేపర్ లీక్ జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతోందని.., లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. రద్దు చేయబడిన పరీక్షలను త్వరలోనే నిర్వహిస్తామని.., నిరుద్యోగ యువత ఆదైర్యపడొద్దని సూచించారు.


అదే సమయంలో ప్రతిపక్షాలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు కేటీఆర్. యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచించారు. టీఎస్‌పీఎస్సీ దేశంలోనే అత్యంత పారదర్శంకగా పనిచేసే వ్యవస్థ అని చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్ సైతం రెండు సార్లు టీఎస్పీఎస్సీని సందర్శించి.. ఇక్కడి సంస్కరణలపై అధ్యయం చేసినట్లు చెప్పుకొచ్చారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఏ2గా ఉన్న రాజశేఖర్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని..,ఈ విషయంపై తమ పార్టీ తరుపున డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM