ఈ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలి: రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Mar 19, 2023, 05:15 PM

పేపర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ  టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 2016 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ప్రతిభావంతులు, పేద అభ్యర్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఇద్దరికే సంబంధముందంటూ మంత్రి కేటీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారంటూ విమర్శించారు. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయడమే కాదు చంచల్‌గూడ్ జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. నిందితుల దగ్గరకు చంచల్‌గూడకు ఎవరు మధ్యవర్తిత్వం చేస్తూ వెళ్లారు.. పేర్లు బయటపెడితే చంపేస్తామని ఎవరు బెదిరించారో.. అన్ని బయటకు రావాలన్నారు. చంచల్‌గూడ సందర్శకుల జాబితా అన్ ఎడిటెడ్ వెర్షన్, సీసీ కెమెరాల ఫుటేజ్ విడుదల చేయాలన్నారు. ఎవరు ఈ లీక్ వెనుకున్నారో తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు.


నిందితులను కస్టడీకి తీసుకోకముందే రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ మాత్రమే నిందితులని కేటీఆర్ ఎలా నిర్ధారించారని రేవంత్ రెడ్డి నిలదీశారు. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులెవరైనా ఆ సంస్థ నిబంధనల మేరకు ఆ సంస్థ నిర్వహించే పరీక్షలకు పోటీ పడేందుకు అనర్హులు. కానీ.. కేసీఆర్, కేటీఆర్ చొరవతో 20 మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలి, లాంగ్ లీవ్‌లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలని వివరించారు. కానీ.. టీఎస్పీఎస్సీలో పనిచేసే మాధురికి ఫస్ట్ ర్యాంక్ రావడం‌, రజనీకాంత్ రెడ్డికి నాలుగో ర్యాంక్ రావడం వెనుక కారణాలేంటో తెలియాలన్నారు.Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM