ఆ పేపర్ లీక్ వ్యవహారంలో ,,,​కేసీఆర్ ఆఫీస్ పాత్ర కూడా ఉంది: రేవంత్ రెడ్డి​

byసూర్య | Sun, Mar 19, 2023, 05:12 PM

పేపర్ లీక్ ఘటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఉందని టీ పీసీసీ చీప్  రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డితో అదే మండలానికి చెందిన కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఔట్ సోర్సింగ్‌లో రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం ఇప్పించి.. ప్రమోషన్ ఇప్పించడంలో తిరుపతి పాత్ర ఉందన్నారు. కేటీఆర్ ప్రమేయంతో కేసీఆర్ ఆఫీస్ పాత్ర కూడా ఉందన్నారు. తిరుపతికి రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు కాగా.. మల్యాల మండలం నుంచి ఎగ్జామ్ రాసిన వారికే 25 మందికి 103 అత్యధిక మార్కులు రావడం వెనుక మతలబు ఏంటో తెలియాలన్నారు.


టీఎస్పీఎస్సీ వ్యవహారంలో మంత్రులు, ఛైర్మన్, సెక్రటరీ పాత్ర లేదని నిరూపించుకోవాలంటే ఈ మొత్తం వ్యవహారం విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి పాత్రపై కూడా విచారణ చేయించాలన్నారు. నిందితులందరి పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చిందా.. లేదా బయటపెట్టాలన్నారు. ఇవన్నీ కేటీఆర్‌కు తెలుసా, లేదా చెప్పాలన్నారు.


"మంత్రి పేషీలో జరిగిన తతంగమంతా మంత్రికి తెలువకుండా ఎలా జరుగుతుంది? ఈ ఆరోపణల నుంచి కేటీఆర్ గానీ.. ప్రభుత్వంగానీ తప్పించుకోలేదు. నిన్న మంత్రి కేటీఆర్ తత్తరపాటు, తొందరపాటే కళ్లకు కట్టింది. గతంలోనూ ఇదే కేటీఆర్ స్నేహితుడికి చెందిన గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ పరీక్షల కాంట్రాక్టు అప్పజెప్పారు. అప్పుడు కూడా ఇదే టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 27 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి బయటకు రారు ప్రజలకు వివరణ ఇవ్వరు. షాడో సీఎంగా ఉన్న కేటీఆర్ ఇద్దరే నిందితులని చెప్పాక సిట్ అధికారి ఏ ఆర్ శ్రీనివాస్ ఏం చేస్తాడు..?" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM