కవితా పిటిషన్ కు కౌంటర్ గా.... కోర్టులో ఈడీ కేవియెట్ దాఖలు ధాఖలు

byసూర్య | Sun, Mar 19, 2023, 05:13 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్  గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఈడీ కేవియెట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని ఈడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.



Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM