వెబ్ సీరీస్ లకు కూడా సెన్సార్ తప్పనిసరి చేయాలి: విజయశాంతి

byసూర్య | Sun, Mar 19, 2023, 05:10 PM

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలని   నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి సూచించారు. ఇటీవల విడుదలైన ఓ వెబ్ సిరీస్‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ వెబ్ సిరీస్ పేరు ప్రస్తావించకుండా.. ‘ఇటీవల విడుదలైన ఓ తెలుగు ఓటీటీ సిరీస్‌పై’ అంటూ విమర్శలు గుప్పించారు. 


ఓటీటీలో ప్రసారమయ్యే చిత్రాల్లోని అసభ్యకరమైన దృశ్యాలను తొలగించి, ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని నటులు, నిర్మాతలను విజయశాంతి కోరారు. మహిళా వ్యతిరేకతతో ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దని, ప్రేక్షకుల అభిమానాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయశాంతితో తాము ఏకీభవిస్తున్నట్టు చెబుతూ పోస్టులు చేస్తున్నారు.Latest News
 

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందించిన ప్రభుత్వ విప్ Thu, Mar 23, 2023, 03:57 PM
6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి Thu, Mar 23, 2023, 03:44 PM
బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి Thu, Mar 23, 2023, 03:13 PM
రేపు బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు భూమిపూజ Thu, Mar 23, 2023, 01:29 PM
అలర్ట్: రెండు రోజుల పాటు వర్షాలు Thu, Mar 23, 2023, 12:12 PM