పేపర్ లీక్ కేసును సీబీఐకు అప్పగించాలి: రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Mar 19, 2023, 05:08 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన కేసును సీబీఐకు అప్పగించాలని టీపీపీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు. కేటీఆర్ స్నేహితుడు రాజు పాకాలకు ఏఆర్ శ్రీనివాస్‌కు ఉన్న సంబంధమేంటో తేటతెల్లం చేయాలని ఆయన  తెలిపారు. సిట్ దర్యాప్తుపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. టీఎస్పీఎస్సీ వివరాలు పబ్లిక్ డొమైన్‌లో కూడా పెట్టడం లేదని ఆరోపించారు. రహస్యంగా నియామకాలు జరుగుతున్నాయన్నారు. హైకోర్టులో కాంగ్రెస్ రిట్ పిటిషన్ వేయడంతోనే ప్రభుత్వం ఈ హడావిడి చేస్తోందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తు కంటే ముందే ముఖ్యమంత్రి వివరాలు వెల్లడించడంతో సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు హైకోర్టు చెప్పింది. అదే తరహాలో నిన్న కేటీఆర్ వివరాలు బహిరంగపర్చారని ఆరోపించారు. ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు కోర్టును కోరతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాకోర్టులో పోరాటం చేస్తూనే.. ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటమూ చేస్తామన్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని 30 లక్షల మంది నిరుద్యోగ యువతను పిలుపునిస్తున్నానన్నారు. గవర్నర్ తమిళిసైని కలిసి వినతిని వినిపిస్తామన్నారు రేవంత్ రెడ్డి.


Latest News
 

గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM
ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM