నవీన్ హత్య కేసులో నిహారికకు బెయిల్,,,మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు

byసూర్య | Sun, Mar 19, 2023, 03:36 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు నిహారికకు బెయిల్ వచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టు నిహారిక రెడ్డికి బెయిల్ మంజురు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి బయటకు విడుదల కానుంది. రాష్ట్రంలో కలకలం రేపిన నవీన్ హత్య కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హరి ఫ్రెండ్ హాసన్, ఏ3గా నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు.


నవీన్‌ను హత్య చేసినట్లు హసన్, నిహారికకు హరి ముందే చెప్పగా.. తమకు సమాచారం అందించకపోడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అంతేకాకుండా ఫోన్‌లో సమాచారాన్ని డిలీట్ చేసినందుకు హాసన్, నిహారికలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నవీన్ హత్యలో వారిద్దరి పాత్రపై పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా హత్య గురించి తమకు తెలిసిన వివరాలను నిహారిక, హాసన్ చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల పాటు పోలీసుల విచారణలో నిహారిక నోరుమెదపలేదు. తనను పోలీసులు విచారిస్తే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిురింపులకు దిగింది.


ఈ క్రమంలో నిహారికను పోలీసులు సఖి కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ తర్వాత నిహారికను అదుపులోకి తీసుకుని విచారించారు. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ప్రియుడు హరికి ఆన్‌లైన్‌లో రూ.1500 డబ్బులు నిహారిక పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఛార్జీల కోసమని నిహారిక పంపినట్లు తేలింది. ఇక నిహారిక కోసమే తాను నవీన్‌ను చంపినట్లు హరిహరకృష్ణ విచారణలో తెలిపాడు. గత కొంతకాలంగా నిహారికను నవీన్ వేధిస్తున్నాడని, కాల్స్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ కోపంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.Latest News
 

మానవత్వం చాటుకున్న కేటీఆర్ Wed, May 22, 2024, 01:44 PM
భార్యను చంపిన భర్త Wed, May 22, 2024, 01:40 PM
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు Wed, May 22, 2024, 12:48 PM
నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, May 22, 2024, 12:18 PM
కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం Wed, May 22, 2024, 12:16 PM