దౌల్తాబాద్ మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్ర

byసూర్య | Sun, Mar 19, 2023, 11:23 AM

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఆదివారం హత్ సే జోడో యాత్రలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన 33వ రోజు ఆత్మగౌరవ యాత్ర కొనసాగించారు. శ్రీనివాస్ రెడ్డి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, 500 కి గ్యాస్, నిత్యవసర సరుకుల ధరల తగ్గింపు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Latest News
 

జంతుబలిని నివారించండి Sun, Jun 16, 2024, 08:15 PM
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని రైతుల డిమాండ్ Sun, Jun 16, 2024, 08:13 PM
తిరుమలనాథస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయండి Sun, Jun 16, 2024, 08:11 PM
ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం Sun, Jun 16, 2024, 08:10 PM
రేపు ఆత్మకూరులో బక్రీద్ నమాజ్ వేళలు Sun, Jun 16, 2024, 08:08 PM