రాజన్న సిరిసిల్ల పూర్వ డిఈవో డాక్టర్ రాధా కిషన్ కు జాతీయ పురస్కారం

byసూర్య | Sun, Mar 19, 2023, 10:40 AM

రాజన్న సిరిసిల్ల పూర్వ డీఈవో డాక్టర్ రాధా కిషన్ జాతీయ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నీపా) ఈ అవార్డును అందజేయనుంది. రాజన్న సిరిసిల్ల డీఈవోగా ఉన్న కాలంలో సీఎస్సార్‌ నిధులతో బడులను అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వడంతో రాధాకిషన్‌ కు బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుల కోసం జాతీయస్థాయిలో ఎన్నో నామినేషన్లు వచ్చిన డీఈవో డాక్టర్ రాధా కిషన్ కృషి అత్యంత ప్రభావితంగా నిలిచింది. డాక్టర్ రాధా కృష్ణతో పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి డీఈవో విజయకుమారి కూడ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.


Latest News
 

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందించిన ప్రభుత్వ విప్ Thu, Mar 23, 2023, 03:57 PM
6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి Thu, Mar 23, 2023, 03:44 PM
బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి Thu, Mar 23, 2023, 03:13 PM
రేపు బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు భూమిపూజ Thu, Mar 23, 2023, 01:29 PM
అలర్ట్: రెండు రోజుల పాటు వర్షాలు Thu, Mar 23, 2023, 12:12 PM