భూత్పూర్లో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

byసూర్య | Sun, Mar 19, 2023, 10:16 AM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం కప్పెటలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై భాస్కర్రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన మసూద్ పాషా, బోయ నాగరాజు వాగు నుంచి శనివారం అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో తనిఖీలు చేయగా రెండు ట్రాక్టర్లు పట్టుపడ్డాయి. ట్రాక్టర్లను ఠాణాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM