తెలంగాణలో పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్.... ప్రధాని వెల్లడి

byసూర్య | Sat, Mar 18, 2023, 09:29 PM

పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అపారెల్ పార్క్) టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.


టెక్స్ టైల్  పార్క్ ఏర్పాటుతో లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపాది, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌ టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని మోదీ చెప్పారు.. కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయని, లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని తెలిపారు. ఇది 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఫర్ ది వరల్డ్'కి గొప్ప ఉదాహరణ అవుతుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.  ఈ పార్క్ ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు అందించిన కానుక అని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM