హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తాం: బోయ లింగాస్వామి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:55 PM

హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తామని ఎం. ఆర్. పి. ఎస్ మండల కన్వీనర్ బోయ లింగాస్వామి హెచ్చరించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని డా. బి. ఆర్ అంబేద్కర్ భవనంలో ఎం. ఆర్. పి. ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. ఆర్. పి. ఎస్ మండల కన్వీనర్ బోయ లింగాస్వామి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్. సి వర్గీకరణ బిల్లు ను ప్రవేశ పెడతామని చెప్పి, 9 సంవత్సారాలు గడుస్తున్న చేయడం లేదని అన్నారు. ఏప్రిల్ 4 న లక్ష లాధి మందితో హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తామని అన్నారు. మార్చి 27 న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎర్ర శంకర్, బొడ్డు శ్రావణ్ కుమార్, బోయ శ్రావణ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.


Latest News
 

జంతుబలిని నివారించండి Sun, Jun 16, 2024, 08:15 PM
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని రైతుల డిమాండ్ Sun, Jun 16, 2024, 08:13 PM
తిరుమలనాథస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయండి Sun, Jun 16, 2024, 08:11 PM
ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం Sun, Jun 16, 2024, 08:10 PM
రేపు ఆత్మకూరులో బక్రీద్ నమాజ్ వేళలు Sun, Jun 16, 2024, 08:08 PM