కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలి... రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:05 PM

కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడని తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇదిలా ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమై, ఇటీవల టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో మనస్తాపం చెందిన సిరిసిల్ల యువకుడు నవీన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడని పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్-1కి సన్నద్ధమైన సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజి పరిణామాలతో మనస్తాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడని వివరించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 


నవీన్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, కాంగ్రెస్ అండగా ఉంటుందని, పోరాటం చేద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


Latest News
 

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందించిన ప్రభుత్వ విప్ Thu, Mar 23, 2023, 03:57 PM
6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి Thu, Mar 23, 2023, 03:44 PM
బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి Thu, Mar 23, 2023, 03:13 PM
రేపు బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు భూమిపూజ Thu, Mar 23, 2023, 01:29 PM
అలర్ట్: రెండు రోజుల పాటు వర్షాలు Thu, Mar 23, 2023, 12:12 PM