నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ వరం

byసూర్య | Wed, Feb 01, 2023, 07:47 PM

నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. ఈమేరకు నిజాంపేట మండల పరిధిలోని నిజాంపేట, నందిగామ, కల్వకుంట, బచ్చురాజ్‌పల్లి, నార్లాపూర్‌ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ. 629500/– చెక్కులను ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డి బుదవారం నిజాంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యసాయం అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని పేద ప్రజల ఆరోగ్యాలకు సీఎంఆర్‌ఎఫ్‌ అందిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు వైద్యం చేసేందుకు అవసరమైన వైద్య ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందిస్తున్నారని ఈ పథకాన్ని లబ్ధిదారులుసద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, వివిద గ్రామాల సర్పంచులు గెరిగంటి అనూష్, అమరాసేనారెడ్డి, అనిల్, ఎంపీటీసీలు పప్పుల లహరి కిష్టా రెడ్డి, బాల్‌ రెడ్డి, లద్ద సురేష్, ఉప సర్పంచులు బాబు, శేఖర్, పీఎసీఎస్‌ చైర్మన్‌ బాపురెడ్డి, బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సుదాకర్‌ రెడ్డి, బీఆర్ఏస్ నాయకులుసంపత్, మావురంరాజు, నాగరాజు, లక్ష్మినర్సింలు, అబ్ధుల్అజీజ్, రవి, మహేష్‌, ధర్మ రెడ్డి, లక్ష్మణ్, లక్ష్మణ్ గౌడ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM