byసూర్య | Wed, Feb 01, 2023, 07:44 PM
ఫిబ్రవరి 5న జరుగుతున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో విద్య రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని బుదవారం మెదక్ నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ అన్నారు. విద్య రంగానికి నిధులు లేక విద్యను మొత్తం తుంగలో తొక్కేసే విధంగా నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. కావున వచ్చే విద్యా సంవత్సరానికి సరిపడా నిధుల కేటాయించాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటి డిమాండ్ చేస్తున్నామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3500 కోట్ల స్కాలర్షిప్&ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ విడుదల లేక విద్యార్థులకు చదువు దూరమవుతున్నారు అలాగే ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు స్కాలర్షిప్ లేక విద్యార్థులను ఫీజులు కట్టే వరకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ లేక విద్యార్థులు చదువు దూరమయ్యే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని అన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి 30 శాతం కేటాయించకపోతే ప్రదర్శనలు నిర్వహిస్తామని అన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా పిలుపు తీసుకొని పెద్ద ఎత్తున విద్యార్థులను కదిలించి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, శ్రీకాంత్, డివిజన్ నాయకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.