తహాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన నిరుపేదలు

byసూర్య | Mon, Jan 30, 2023, 04:55 PM

అర్హులైన పేదలను విస్మరించి అనర్హులకు, డబ్బులు ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారని నిరసిస్తూ అర్హులైన నిరుపేదలు సోమవారం బాన్సువాడ తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహాసిల్దార్ గంగాధర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించి ప్రారంభించిన 504 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిజమైన పేదవారికి కాకుండా, ఇండ్లు, వ్యాపారాలు, స్థానికేతరులకు డబ్బులు ఇచ్చిన వారికే డబుల్ ఇండ్లను కేటాయించారని వారు ఆరోపించారు.


డబుల్ ఇండ్ల పంపిణీ రోజు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కేవలం ఇండ్లు వచ్చిన వారికి లోపలికి ప్రవేశం కల్పించడంతో లేనివారు బయట నిరసన తెలియజేసిన వారిని పోలీసులతో అక్రమంగా వ్యాన్ లో ఎక్కించి నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారని తాము ఏ పాపం చేశామని వారు వాపోయారు. ఎన్నికల అప్పుడు మాత్రం తాము గుర్తుకొస్తామని సంక్షేమ పథకాలకు మాత్రం తాము గుర్తుకురామని వారు ప్రశ్నించారు. ఆందోళన చేసినందుకు గాను తమల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ప్రశ్నించారు.


ఆందోళన చేస్తున్న నిరుపేదలకు బిజెపి నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించాలని లేనిపక్షంలో పేదల పక్షాన బిజెపి పార్టీ పోరాడుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్, సీనియర్ నాయకులు చిదుర సాయిలు, బిజెపి పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, ముత్యాల సాయిబాబా, రాజాసింగ్, కోణాల గంగారెడ్డి, నాంపల్లి శ్యాం, విశాల్, వినోద్, బాన్సువాడ పట్టణంలోని ఆయా కాలనీల నిరుపేదలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM