సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Mon, Jan 30, 2023, 04:38 PM

భారత్ జోడోయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జియంఆర్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి (GMR) మరియు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. అనంతరం భారత్ జోడోయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం లో జిఎంఆర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, శాంతి, అహింసలే ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్రం సాధించడంలో విజయం సాధించారని గాంధీజీ ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.


దేశ ప్రజలను ఏకం చేయడానికి సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి, ఎండ, వాన, చలి ని సైతం లెక్కచేయకుండా చిత్తశుద్ధితో రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారని పేర్కొన్నారు. నిన్న కాశ్మీర్ లో జాతీయ జెండా ఎగరవేయడం ద్వారా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ముగించారని తెలిపారు. కాశ్మీర్ గడ్డ లాల్ చౌక్ పై జాతీయ జెండా రెపరెపలాడుతుంటే సగటు భారతీయుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నానని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ అసేతు హిమాచలం వరకు దేశ ప్రజలను ఏకం చేయడానికి రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, గాంధీ సిద్ధాంతాలను, భారత్ జోడో యాత్ర లక్ష్యాలను, రాహుల్ గాంధీ సందేశాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఫిబ్రవరి 6 నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో యాత్ర లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పాల్గొనాలని మీడియా సమావేశంలో పిలుపునిచ్చిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి (GMR) .


ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్, సంజీవ్ ముదిరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత రాఘవేంద్ర రాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జహీర్ అక్తర్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జె. చంద్రశేఖర్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఆవేజ్, వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేవ్ పార్టీ అంటే ఇదా..? నిజంగానే అలాంటి పనులు చేస్తారా Tue, May 21, 2024, 10:07 PM
వాళ్లను బజారుకీడ్చటం కరెక్ట్ కాదు.. రేవ్ పార్టీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 10:02 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Tue, May 21, 2024, 09:34 PM
ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష Tue, May 21, 2024, 09:32 PM
రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య Tue, May 21, 2024, 09:29 PM