పలు భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ

byసూర్య | Sat, Jan 28, 2023, 12:06 PM

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో 10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం
1.56 కోట్లతో నిర్మించే నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పి. హెచ్. సి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా తలమడుగు మండల ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై సవతి ప్రేమ చూపిస్తుందని, ఎన్నో రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జిల్లాకొక మెడికల్ కాలేజి ఇచ్చారన్నారు. అదేవిధంగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో రోడ్లు లేక బ్రిడ్జిలు లేక సరియైన ఆసుపత్రులు లేక పట్టణానికి వెళ్లాలంటే ఎంతో అవస్థలు పడేవారని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అద్దాల్లా రోడ్లు వేసి మరి ప్రతి పల్లెల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, తహసీల్దార్ ఇమ్రాన్, ఎంపిడిఓ రమాకాంత్,
పార్టీ మండల కన్వీనర్ వెంకటేష్, అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, వసంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, సర్పంచ్ లు కరుణకర్ రెడ్డి, ఎంపిటిసి చంటి అబ్దుల్లా, కంది నర్సింలు, రాంబాయి, ఆనంద్ నాయకులు గోక జీవన్ రెడ్డి, వెల్మ శ్రీనివాస్ రెడ్డి, మగ్గిడి ప్రకాష్, గంగాధర్, సునీత, పల్లవి తో పాటు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM