పాడైపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ ఎందుకు ఇస్తున్నారు,,,ఎమ్మెల్యే రాజాసింగ్

byసూర్య | Fri, Jan 27, 2023, 09:42 PM

రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. మొరాయించిన బుల్లెట్ ఫ్రూప్ వెహికల్ తనకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ ఎప్పుడు ఆగిపోతుందో అర్ధం కావడం లేదని, రోడ్డుపై ఒక్కసారిగా నిలిపోతుందని చెప్పారు. బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్‌లో తిరగకపోతే నోటీసులు ఇస్తున్నారని, అదే తిరిగితే రోడ్డుపై అర్థాంతరంగా ఆగిపోతుందని తెలిపారు.


ఈ సందర్భంగా తాను చస్తే ఏంటి? బ్రతికితే ఏంటి? అనే భావనలో కేసీఆర్ ఉన్నారని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉంది కాబట్టే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇచ్చామని అధికారులు చెబుతున్నారని, కానీ పాత వెహికల్‌ను రిపేర్ చేసి ఇచ్చారని తెలిపారు. మొరాయించినప్పుడల్లా అధికారులకు పంపిస్తున్నామని, దానినే రిపేర్ చేసి మళ్లీ పంపిస్తున్నట్లు రాజాసింగ్ చెప్పారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం గురించి గతంలోనే అధికారులకు పలుమార్లు లేఖలు రాశానని, అయినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.


తనకు ప్రాణహాని ఉందన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బుల్లెట్ ఫ్రూఫ్ కార్ల ఇంత ఆధ్వానంగా ఉంటాయా? అని ప్రశ్నించారు. పలుమార్లు రోడ్డుపై ఆగిపోయిందని, తాను ఆటోలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని మీరు తీసుకోండి.. పాడైన వాహనం ఎందుకు ఇస్తున్నారు? అని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాజాసింగ్ బెల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ అనేకసార్లు రోడ్డుపై నిలిచిపోగా.. గత మూడు రోజుల క్రితం శంషాబాద్ నుంచి ఇంటికెళ్లే సమీపంలో పురానాపూల్ సర్కిల్ వద్ద మరోసారి ఆగిపోయింది. దీంతో ప్రభుత్వంపై రాజాసింగ్ మండిపడ్డారు.


ఇప్పటికీ ఐదుసార్లు రోడ్డుపై ఆగిపోయిందని, ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు మంచి బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్స్ ఇస్తున్న ప్రభుత్వం.. తనకు మాత్రం పాడైపోయిన వాహనం కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన వాహనాన్ని వాపస్ తీసుకోవాలని అధికారులకు సూచించినా.. స్పందించడం లేదని తెలిపారు. తనకు మొరాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదని రాజాసింగ్ వాపోయారు.


రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు కావడం, జైలుకు తరలించడంతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌కు నోటీసులు పంపించగా.. ఆయన సమాధానమిచ్చారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలనే డిమాండ్లు బీజేపీ కార్యకర్తల్లో వినిపిస్తుండగా.. ఇప్పటివరకు సస్పెన్షన్ ఎత్తివేయడంపై కాషాయదళం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల నాటికి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై బీజేపీ వర్గాల్లో సస్పెన్స్ నెలకొంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM