![]() |
![]() |
byసూర్య | Fri, Jan 27, 2023, 10:03 PM
దేశ భవిష్యత్తు కోసం బీఆర్‌ఎస్ పార్టీ అని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మన దేశ సంపద చైనా కంటే ఎక్కువ... కానీ అమెరికా, చైనాల అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది? మన దేశం ఏ స్థాయిలో ఉంది? అయన ప్రశ్నించారు. భారతదేశంలో 75 ఏళ్లు గడిచినా తాగడానికి మంచినీరు ఇవ్వలేకపోతున్నామని, దేశంలో పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదన్నారు. ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించాం? అని ఆయన వ్యాఖ్యానించారు. కొందరికి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మారింది. కులం, మతం పేరుతో ఓట్లు అడిగే వారు గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు.