రైతుల సంక్షేమం కోసం ఆలోచించిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్

byసూర్య | Wed, Jan 25, 2023, 01:33 PM

రైతుల సంక్షేమం కోసం ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం నర్సింహపురం గ్రామంలో రూ. 30 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా రైతుల అకౌంట్లో నగదు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని, అదే విధంగా దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని ఉన్నారు.నర్సింహాపురం గ్రామం నుండి చిన్న సూరారం గ్రామానికి వెళ్లే రోడ్డు మరమ్మతుల కోసం రూ. 5 లక్షలను త్వరలో మంజూరు చేస్తామని, అదేవిధంగా గ్రామంలో పెండింగ్ లో ఉన్న వివిధ పనులకు త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM