బీసీ సేన నూతన మండల కమిటీ ఎన్నిక

byసూర్య | Tue, Jan 24, 2023, 02:44 PM

మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో చేసిన బీసీసేన నాయకుల సమావేశంలో, బీసీసేన మండల అధ్యక్షులుగా, బొల్లెమోని నిరంజన్, మండల కార్యనిర్వాహక అధ్యక్షులుగా మల్లెబోయినపల్లి గోపాల్ , కార్మిక విభాగం మండల అధ్యక్షులుగా ఆకుల చంద్రమౌళిలను నియమిస్తూ నియామక పత్రం అందజేసిన బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ,మండలంలోని అన్ని గ్రామాలలో,చైతన్య సదస్సులు నిర్వహించి,బీసీలందరూ రాజకీయాలకతీతంగా ఏకతాటి పైకి వచ్చేలా మండల కమిటీ సభ్యులు కృషి చేయాలని, సూచించారు. దేశ జనాభా గణనలో బీసీ కుల గణన చేపట్టాలని, జనాభా దమాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా ఉద్యోగ ఆర్థిక ఉపాధి రంగాలలో, సమాన వాటా కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, 70 సంవత్సరాలుగా బీసీలు పోరాడుతున్నా రని అయినా పాలకులకు చెవికెక్కడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణంగా రాజ్యాంగ ఫలాల సాధన కోసం, బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి పోరాడితేనే, సామాజిక న్యాయం జరుగుతుందని, ఉద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లింగంపేట్ గౌరీ శంకర్, నియోజవర్గం ప్రధాన కార్యదర్శి, లింగంపేట్ శేఖర్, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, గోపాల్ మాచారం శ్రీనివాస్, నియోజవర్గం కార్యదర్శి రామస్వామి, మండల కార్యదర్శి రఘు, పట్టణ అధ్యక్షులు శివరాములు, పట్టణ కార్యనిర్వక అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ ,రమేష్, శ్రీనివాసులు, , అప్సర్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM