ధరణి పోర్టల్‌ను రద్దు చేసే వరకు పోరాడుతాం..

byసూర్య | Tue, Dec 06, 2022, 10:49 AM

సంగారెడ్డి రైతులకు నష్టం కలిగించే ధరణి పోర్టల్‌ను రద్దు చేసే వరకు తాము పోరాడుతూనే ఉంటామని సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట టీపీసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి 2022 వరకు సుమారు 20 లక్షల కుటుంబాల పట్టా భూములను నిషేధిత భూములుగా ప్రకటించిందని, కౌలు రైతులకు సమాన హక్కు కల్పించాలని అటవీ ప్రాంతంలోని ఆదివాసులు సాగుచేసుకునేందుకు కాంగ్రెస్‌ చట్టం తెస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు ఆదివాసులను భయబ్రాంతులకు గురి చేసి వారి భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఆదివాసీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు.


Latest News
 

జంతుబలిని నివారించండి Sun, Jun 16, 2024, 08:15 PM
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని రైతుల డిమాండ్ Sun, Jun 16, 2024, 08:13 PM
తిరుమలనాథస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయండి Sun, Jun 16, 2024, 08:11 PM
ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం Sun, Jun 16, 2024, 08:10 PM
రేపు ఆత్మకూరులో బక్రీద్ నమాజ్ వేళలు Sun, Jun 16, 2024, 08:08 PM