సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య

byసూర్య | Mon, Dec 05, 2022, 11:44 PM

సెల్ టవర్ పై రైతన్న విగతజీవిగా మారాడు. తన భజంపై ఉన్న టవాల్ తోనే ప్రాణాలు తీసుకొన్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. మనస్తాపంతో ఓ రైతన్న కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన పిల్లలు.. వద్దు డాడీ.. అంటూ వేడుకున్నా.. వినకుండా ప్రాణాలు తీసుకున్నాడు. అందరూ చూస్తుండగానే.. సెల్ టవర్ మీద.. ఎప్పుడూ తన భుజాన ఉంటూ చెమట తూడ్చే తువ్వాలతోనే ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు.. సెల్‌టవర్‌ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరి హృదయాలను కలచివేసింది. గ్రామంలో ఉన్న చెరువు సమీపంలోనే ఆంజనేయులుకు కొంత భూమి ఉంది. అయితే.. ఉన్న కొంత భూమి మీదుగా పంట కాలువ నీరు వెళ్తుండటంతో చేసేదేమీ లేక.. కనీసం పరిహారమైనా చెల్లించాలని నాలుగేళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నాడు. పంట కాలువ ద్వారా లబ్ధి పొందుతున్న గ్రామస్థులను కూడా వేడుకున్నాడు. అయితే.. ఆంజనేయులు బాధ చూసి.. రెండేళ్ల కింద అప్పటి తహసీల్దార్‌ అమీన్‌ సింగ్.. రెండు వేల రూపాయలు చెల్లించాడు.


ఇదిలావుంటే గడేడాది రైతులెవ్వరూ చెరువు కింద పంటలు సాగు చేయకపోవటంతో.. ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే.. ఈసారి మళ్లీ పంటలు సాగుచేసేందుకు చెరువు కింది రైతులు సిద్ధమయ్యారు. దీంతో మళ్లీ తన భూమి మీదుగా పంట నీరు వెళ్తుందని ఆంజనేయులు మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రోజు సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి ఎస్సై శంకర్‌, తహసీల్దార్‌ మారుతితో ఫోన్‌లో మాట్లాడాడు. తన సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వాళ్లు ఆంజనేయులుకు ఎంత సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎంత చెప్పినా వినలేదు. తన పిల్లలు "డాడీ.. డాడీ.. దిగు డాడీ" అని కొడుకు, కూతురు ఎంత వేడుకున్నా.. తన నిర్ణయం మార్చుకోలేదు. తన చెమట తూడ్చుకునే తువ్వాలతోనే ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి.. పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.Latest News
 

వ్యాపారి ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం..! చోరీ చేసేందుకు ముఠా స్కెచ్, చివరకు Tue, Jun 18, 2024, 09:24 PM
కరెంటు పోయిందని చెప్తే డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నారు..? యువతి ట్వీట్‌పై కేటీఆర్ రియాక్షన్ Tue, Jun 18, 2024, 09:19 PM
రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట Tue, Jun 18, 2024, 08:19 PM
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీలు.. చందనా దీప్తికి కొత్త బాధ్యతలు Tue, Jun 18, 2024, 08:18 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన... ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్ Tue, Jun 18, 2024, 08:16 PM