మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు

byసూర్య | Sun, Dec 04, 2022, 09:35 PM

శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కు వెళ్లలాంటి మనకు అయ్యే ఖర్చు ఎక్కువేనని హైదరాబాద్ వాసులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తుంటారు. కానీ ఇఫుడో శుభవార్త వినవస్తోంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించదలచిన మెట్రో సెకండ్ ఫేస్ ప్రాజెక్టు హైదరాబాద్‌ వాసులను ఊరిస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి.. అక్కడి నుంచి నగరానికి వచ్చే వాళ్లకు ప్రయాణం సునాయాసమవుతుంది. ఇదిలా ఉండగానే.. మరోవాదన తెరపైకి వచ్చింది. కేవలం 20 రూపాయలకే నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చంటా. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. ఎంఎంటీఎస్‌ రైళ్లను విమానాశ్రయానికి నడపాలని నిర్ణయించారు. అయితే 2014లోనే ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రారంభించారు.. కానీ ఎయిర్‌పోర్టు వరకూ అనుమతించకపోవడంతో ఉందానగర్‌ వరకే వచ్చింది. విమానాశ్రయానికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఎంఎంటీఎస్‌ ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు.. సర్కారు రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో మార్గం నిర్మించేందుకు 6 వేల కోట్ల అంచనాతో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ కారిడార్‌ను కలుపుతూ జరుగనున్న ఈ నిర్మాణం ఆహ్వానించదగ్గదే కానీ.. ఎంఎంటీఎస్‌ రెండోదశకు ఉన్న అవాంతరాలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.


కేవలం రూ. 60 కోట్లు వెచ్చిస్తే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ చేరుకుంటుందంటున్నారు విశ్లేషకులు. స్టేషన్ల నిర్మాణాలతో పాటు మిగత పనులన్నీ కలిపితే రూ.100 కోట్లలో రెండో దశ ఎంఎంటీఎస్ పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. ఇది గనక చేస్తే.. కేవలం 20 రూపాయలతోనే నగరం నుంచి విమానాశ్రయానికి రాకపోకలు సాగించవచ్చని జంటనగరాల సబర్బన్‌ ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి నూర్‌ మహ్మద్‌ పేర్కొన్నారు.


విమానాశ్రయం నుంచి క్యాబ్‌‌లలో రావాలంటే వేలల్లోనే సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెట్రో అందుబాటులోకి వచ్చినా.. అది ఎంఎంటీఎస్‌ కంటే ఎక్కువే ఉంటుంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో పని చేసే వేలాది మంది ఉద్యోగులకు కూడా ఈ ఎంఎంటీఎస్ వల్ల ఉపయోగం ఉంటుందని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి చందు తెలిపారు. కేవలం 6 కిలోమీటర్లు పొడిగిస్తే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌లో తక్కువ ధరలోనే ప్రయాణం సాగించవచ్చని చెబుతున్నారు.Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM