వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది

byసూర్య | Sun, Dec 04, 2022, 09:34 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన కసేపటికి శంషాబాద్  వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఎం కేసీఆర్... మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే.. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి వెళ్లిన రోడ్డు మార్గంలో.. ఆయన వెళ్లిన కాసేపటికే ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లటం వల్ల అప్పటి వరకు ట్రాఫి‌క్‌ను పోలీసులు ఆపేశారు. అయితే.. ముఖ్యమంత్రి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే సామాన్య ప్రజలను కూడా రాకపోకలను అనుమతించారు. రోడ్డంతా ట్రాఫిక్‌మయంగా మారింది. ఈ క్రమంలోనే.. ఓ గర్తు తెలియని డీసీఎం అతివేగంగా దూసుకెళ్లింది. అదుపుతప్పి ముందువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.


డీసీఎం చాలా వేగంగా వచ్చి వెనక నుంచి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో.. దానిపైన ఉన్న ముగ్గురు కింద పడగా.. వారిని డీసీఎం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో.. తీవ్ర గాయాలైన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా.. మృతులు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన గోపాల్ నాయక్(47), అంజలి( 42), స్వాతి(9)గా గుర్తించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిన అరగంటలోనే జరగటం గమనార్హం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM