ఘనంగా దీక్ష దివస్ వేడుకలు

byసూర్య | Tue, Nov 29, 2022, 02:07 PM

దీక్షా దివస్ సందర్బంగా మంగళవారం కరీంనగర్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి కెసిఆర్ కి పాలాభిషేకం చేసిన మంత్రి గంగుల కమలాకర్. నవంబర్ 29 తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర యాదగిరి రావు, తెరాస నాయకులు పాల్గొన్నారు


*ఆరు దశాల తెలంగాణ ఉద్యమం మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం*.


*తెలంగాణ వచ్చుడు - కేసీఆర్ చచ్చుడో అన్న నినాదంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ ప్రయాణం*


*సమైక్య రాష్ట్ర సంకెళ్ళ ను తెంచి. తెలంగాణ విముక్తి కోసం బయలు దేరిన రోజు*.


*2009 నవంబర్ 29 తెలంగాణ ఉద్యమన్ని తీవ్రతరం చేసేందుకు. కరీంనగర్ తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్ నుండి కెసిఆర్ గారు వేలాది కార్యకర్తలతో బయలు దేరినాడు*.


*అల్గునూర్ వద్ద పోలీసులు కెసిఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలు కు తీసుకెళ్లారు*.


*ఖమ్మం జైలు లో కెసిఆర్ గారు చేసిన నిరాహార దీక్షకు తలోగ్గి అప్పటి దేశ ప్రధాని శ్రీమతి సోనియా గాంధీ డిసెంబర్ 09 నాడు తెలంగాణ ప్రకటన చేయించారు*


*దీక్షా దివస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు*.


*తెలంగాణా వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో దీక్షకు దిగిన కేసీఆర్*


*ఆమరణ దీక్షతో చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్


తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు*


*అయితే ప్రజలలో బాగా చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమించలేకపోయారు. కానీ 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రోజుల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ కదిలించింది*


నవంబర్ 29 2009 వ సంవత్సరంలో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మొక్కవోని దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు.


నీళ్లు, నిధులు, నియామకాల కోసం నాడు సాగించిన పోరాటంలో తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆయన ఆమరణ దీక్ష చేయాలని తీసుకున్న దృఢసంకల్పానికి నవంబర్ 29న బీజం పడింది.


డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత 11 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష సాగించిన కెసిఆర్ తన దీక్షను విరమించారు.


కెసిఆర్ సాగించిన ఆమరణ నిరాహార దీక్ష ప్రజలలో రాష్ట్ర సాధన ఆకాంక్షను మరింత బలోపేతం చేసి సబ్బండ వర్ణాలు ఉద్యమించేలా చేసింది.


Latest News
 

టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM
పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM