సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల

byసూర్య | Sat, Nov 26, 2022, 04:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలతో కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె అన్నారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుపడతారని విమర్శించారు. గత ఎనిమిదేళ్లలో ఆయన ఇచ్చిన ప్రతి హామీ మోసమేనన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయాయని ఆరోపించారు. అబద్ధపు హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం బలంగా ఉంటే కేసీఆర్ ఆటలు సాగేవి కాదు అని ఆమె అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుంది అని షర్మిల అన్నారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM