సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం

byసూర్య | Sat, Nov 26, 2022, 03:52 PM

పేదల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని 299 మంది, బాచుపల్లి మండల పరిధిలోని 21 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం లబ్ధిదారులకు రూ. 3, 20, 37, 120/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి శనివారం చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ఇబ్బందులు పడకూడదనే పెద్ద మనస్సుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. స్వరాష్ట్రం సాధించిన నాటి నుండి ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా గౌరవ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Latest News
 

మహారాష్ట్ర రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుంది : సీఎం కెసిఆర్ Sun, Mar 26, 2023, 09:00 PM
కాంగ్రెస్ లోకి డీఎస్ రీఎంట్రీ Sun, Mar 26, 2023, 01:09 PM
అగ్రనేతలకు బిజెపి సంగారెడ్డి జిల్లా నాయకుల స్వాగతం Sun, Mar 26, 2023, 12:50 PM
గ్రేటర్ హైదరాబాద్ శివారు లో రోడ్డు ప్రమాదం Sun, Mar 26, 2023, 12:15 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి Sun, Mar 26, 2023, 12:08 PM