భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా

byసూర్య | Sat, Nov 26, 2022, 07:17 PM

భారీ మెజార్టీతో తెలంగాణలో విజయాన్ని కైవసం చేసుకోబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు.  తెలంగాణ ప్రజల నాడి తనకు తెలుసని... రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని అన్నారు. 


ఎన్నికలకు ముందు తాను తెలంగాణకు వెళ్తానని... బీజేపీని గెలిపించుకుంటామని చెప్పారు. బీజేపీ సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే వంటిదని అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది కూడా ఎన్డీయే ప్రభుత్వమేనని.. మోదీ మరోసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నారని అన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్ 2022లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


 


Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM