ఆ ఫారెస్ట్ రేంజర్ కుటుంభానికి.. రూ.50 లక్షల పరిహారం..ఉద్యోగం...భూమి

byసూర్య | Tue, Nov 22, 2022, 09:01 PM

గుతికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుటుంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రగూడ అటవీప్రాంతంలో గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు బలైన సంగతి తెలిసిందే. అటవీభూముల్లో పోడు వ్యవసాయం వివాదం నేపథ్యంలో గుత్తికోయలు కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లతో శ్రీనివాసరావుపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో మరణించారు. 


ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుత్తికోయల చేతిలో మరణించిన అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాదు, శ్రీనివాసరావు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, రిటైర్మెంట్ వయసు వరకు వేతనం అందిస్తామని వెల్లడించారు.


Latest News
 

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం Mon, Jan 30, 2023, 04:52 PM
వివిధ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Mon, Jan 30, 2023, 04:50 PM
జడ్చెర్ల లో బీఆర్ఎస్ కు భారీ షాక్... సీనియర్ నేతలు టిడిపిలోకి Mon, Jan 30, 2023, 04:48 PM
ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్ Mon, Jan 30, 2023, 04:45 PM
ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు Mon, Jan 30, 2023, 04:42 PM