తెలంగాణ మిర్చికి దక్కిన అరుదైన గౌరవం

byసూర్య | Wed, Sep 28, 2022, 08:41 PM

ఘాటు మిర్చి అంటే గుంటూరు మిర్చి అంటారు. ఇది ఏపీలోని గుంటూరు మిర్చికి ఉన్న ప్రత్యేకత. మరి తెలంగాణ మిర్చి ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే అరుదైన స్థానం దక్కిందని చెప్పవచ్చు. ఇదిలావుంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. తెలంగాణ నుంచి పోచంపల్లి ఇకత్, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్ వంటితో పాటు మరికొన్ని భౌగోళిక గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఆ రేసులో దేశంలోనే అత్యంత తీపి మిర్చి రకంలో ఒకటైన చపాట వరంగల్ మిరప నిలిచింది.


వరంగల్ చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ.. వరంగల్ తిమ్మాపేట్ మిర్చి రైతు ఉత్పత్తి సంస్థ మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన జన్నా రెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యాన పరిశోధనా కేంద్రం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసింది. ఏడాది కాలంగా భౌగోళిక గుర్తింపు సాధించేందుకు అవసరమైన సాగు విధానాలు, దాని పుట్టుక, తెలుగులో ఎన్ని రకాలుగా పిలుస్తారు వంటి అంశాలపై ఉద్యాన పరిశోధనా కేంద్రం అధికారులు అధ్యయనం చేశారు. ఈ మిర్చిలోని పోషక విలువలను రాజేంద్రనగర్‌లోని క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌, రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్‌బోర్డులో పరీక్ష చేయించారు.


'టమాట చపాట వరంగల్ మిరపకాయ' అని కూడా పిలువబడే చపాట మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికమన్‌ను పోలి ఉండే ఈ మిరప వరంగల్‌లోనే పండుతుంది. ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుందని ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు, మిర్చి రైతులు తెలిపారు. స్కోవిల్లే స్కేల్‌లో ఈ మిరపకాయ యొక్క ఘాటు తక్కువగా ఉంటుందని తేలింది. ఈ మిర్చిని ఆహారశుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్‌, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.23 వేల నుంచి రూ.25 వేలు పలుకుతుంది.


ఈ మిర్చికి అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా తూర్పు ఆసియాలో విపరీతమైన డిమాండ్ ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయ సీనియర్ అధికారి తెలిపారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయన్నారు చపాట మిర్చిని రెస్టారెంట్లతో పాటు ఊరగాయల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారని చెప్పారు. ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వస్తే.. తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ సాధించిన 18వ ఉత్పత్తిగా చపాట వరంగల్ మిర్చి నిలుస్తుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM