byసూర్య | Fri, Sep 23, 2022, 01:12 PM
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేణుకా చౌదరి, గీతారెడ్డి, అంజన్ కుమార్ లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు.