![]() |
![]() |
byసూర్య | Thu, Sep 22, 2022, 06:55 PM
హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించారు. ఇకపై మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అతికించిన వారికి రూ.1000 జరిమానాతోపాటు ఆరునెలలు జైలు శిక్ష విధించే అవకాశముందన్నారు. సెంట్రల్ మెట్రో రూలను అమలు చేస్తామని చెప్పారు. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతామని ఆయన వెల్లడించారు.