byసూర్య | Thu, Sep 22, 2022, 05:23 PM
తెలంగాణలో మరో సూది మందు హత్య కలకలం రేపింది. భిక్షం అనే ల్యాబ్ టెక్నీషియన్ తన రెండో భార్య నవీన(23)ను హత్య చేసేందుకు సూది మందు ప్లాన్ అమలు చేశాడు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి డెలివరీ కోసం రెండో భార్యను తీసుకెళ్లిన భిక్షం సెలైన్ బాటిల్లో పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించడంతో ఆమె మరణించింది. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.