టిక్కెట్ల అమ్మకాలపై నిఘా పెట్టాము: మంత్రి శ్రీనివాస్ గౌడ్

byసూర్య | Thu, Sep 22, 2022, 03:31 PM

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. టిక్కెట్ల అమ్మకాలపై నిఘా పెట్టామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మ్యాచ్ డేట్ ఫిక్స్ అయినప్పుడే హెచ్ సి ఏ ఏర్పాటు చేసుకోవాలని, టిక్కెట్ల అమ్మకాల విషయంలో హెచ్ సి ఏ వైఫల్యం పూర్తిగా ఉందన్నారు. ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ సి ఏ ప్రతినిధులెవరూ సంప్రదించలేదన్నారు. తప్పు జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెచ్ సి ఏ  వ్యవహారంపై ఒక కమిటీ వేస్తామన్నారు. టికెట్స్ అమ్మకాలపై హెచ్ సి ఏ హడావుడి నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డారు.  

క్రికెట్ టికెట్ల గందరగోళంపై మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులు తన కార్యాలయానికి రావాలని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయి. ఎన్ని ఆన్లైన్లో పెట్టారు. ఎంతమందికి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారు అనే సమాచారంతో రావాలని మంత్రి ఆదేశించారు. హెచ్సీఏ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అడీషనల్ కమిషనర్ చౌహాన్ అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం టికెట్స్ కౌంటర్స్ ని పెంచారని తెలిపారు. తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని. గాయపడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు.


Latest News
 

మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చింది...రేవంత్ రెడ్డి Tue, Oct 03, 2023, 10:20 PM
రేవంత్ రెడ్డి రెండేళ్లుగా చెబుతోంది ఇదే.... మాణికం ఠాగూర్ Tue, Oct 03, 2023, 10:19 PM
ఎన్నికల వేళ... రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు Tue, Oct 03, 2023, 10:18 PM
కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లు ఎవరో తెలుస్తుంది.... మంత్రి కేటీఆర్ Tue, Oct 03, 2023, 10:17 PM
ఆ ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేసిన కేటీఆర్ Tue, Oct 03, 2023, 09:44 PM