హెచ్ సి ఏ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలి

byసూర్య | Thu, Sep 22, 2022, 03:30 PM

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడాభిమానులపై జరిపిన లాఠీచార్జ్ దారుణమని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఇది పూర్తిగా హెచ్ సీఏ, ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.  టికెట్లు బ్లాక్ లో అమ్మడంతో పాటు ఇంకా అనేక  అక్రమాలు జరిగాయన్న ఆయన. హెచ్ సి ఏ యాజమాన్యంపై, అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా దాదాపు ఐదు రోజులుగా ఫ్యాన్స్ టికెట్స్ కోసం జింఖానా, ఉప్పల్ స్టేడియం చుట్టూ తిరుగుతున్నారు. మొదట్లో ఆన్ లైన్ లో అమ్మినా. ఆ తర్వాత బుక్ చేసుకున్నవాళ్లకు కూడా డబ్బులు వెనక్కి వచ్చాయి. అటు ఆన్ లైన్ లో, ఇటు ఆఫ్ లైన్ లో టికెట్స్ దొరక్కపోవడంతో ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోయింది. బుధవారం వేలాదిగా గ్రౌండ్ కు చేరుకోవడం, హెచ్ సి ఏ పై వత్తిడి పెరగడంతో. ఇవాళ టికెట్స్ ఇస్తామంటూ హెచ్ సి ఏ ఫ్రకటించింది. వేలాదిమంది వస్తారు అని తెలిసినా ఒక్కటే కౌంటర్ పెట్టారు అని మండిపడ్డారు.

Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM