బైక్ ను ఆటోతో ఢీకొట్టించి..ఆపై వేటకొడవళ్లతో నరికి

byసూర్య | Mon, Aug 15, 2022, 09:18 PM

ఖమ్మం జిల్లాలో ధారుణం చోటుచేసుకొంది.  టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్ పై వెళ్తుండగా ఆయనను దారుణంగా హత్య చేశారు. ఆయన బైక్ ను ఆటోతో ఢీకొట్టించిన దుండగులు... వేటకొడవళ్లతో నరికి చంపేశారు. తెల్దారుపల్లి శివార్లలో ఈ దారుణం జరిగింది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 


ప్రస్తుతం కృష్ణయ్య ఆంధ్ర బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు ఈ హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడి... ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.


Latest News
 

సమస్యల సత్వర పరిష్కారానికి కృషి Thu, Dec 08, 2022, 12:14 PM
పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు Thu, Dec 08, 2022, 12:03 PM
ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతం Thu, Dec 08, 2022, 11:43 AM
ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది Thu, Dec 08, 2022, 11:37 AM
నిరు పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే Thu, Dec 08, 2022, 11:33 AM