గంగిరెద్దుపాయే...వాటి స్తానంలో కుక్కవచ్చే

byసూర్య | Wed, Aug 10, 2022, 09:27 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సమయంలో గంగిరెద్దులు సందడి చేస్తుంటాయి. కొంతమంది ఎద్దులను అందంగా అలంకరించి ఊరూరా తిప్పుతూ భిక్షాటన చేస్తుంటారు.అయితే ఇటీవల కాలంలో పట్టణాలు, నగరాల్లోనూ గంగిరెద్దులు కనిపిస్తున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా చాలామంది గంగిరెద్దులతో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. అయితే ఎద్దులున్న వారు వాటిని గంగిరెద్దుగా అలంకరించి తిప్పుతారు... కానీ అది లేకపోతే ఎలా.. ఇదే ఆలోచన వచ్చింది ఓ వ్యక్తి.


నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో సన్నాయి చప్పుడుకు బయటకు వచ్చిన ఓ ఇల్లాలు అవాక్కయింది. భిక్షాటన కోసం వచ్చిన ఓ వ్యక్తి గంగిరెద్దు స్థానంలో కుక్కను తీసుకొచ్చాడు. ఇదేంటని ఆమె అడిగితే గంగిరెద్దులు దొరకడం లేదని.. మామూలుగా వెళ్లి భిక్షం వేయమని అడిగితే ఎవరూ వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గంగిరెద్దు స్థానంలో ఇలా కుక్కను తీసుకొచ్చి భిక్షాటన చేసుకుంటున్నానని చెప్పాడు. అతడి బాధను అర్ధం చేసుకున్న ఆ ఇల్లాలు తనకు తోచినంత సాయం చేసి అతడిని పంపించింది. కాలంతో పాటే మన సంప్రదాయాలు, ఆచారాలు మారుతున్నాయి. ఇతగాడి ఆలోచన మిగతా వారికి కూడా వస్తే త్వరలోనే గంగిరెద్దుల స్థానాన్ని శునకాలు ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM