పదునైన ఆయుధంతో కొట్టి చంపిన భార్య

byసూర్య | Sat, Aug 06, 2022, 12:53 PM

రిటైర్డ్ ప్రొఫెసర్ టి కృష్ణకాంత్ శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు. హనుమకొండ గోపాలపూర్ ఎఫ్సీఐ కాలనీ-లో నివసిస్తున్న టి కృష్ణ కాంత్, కాకతీయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేసి పదవి విరమణ పొందారు. అతనికి, అతని భార్య లలిత కుమారి మధ్య కుటుంబకలహాలు ఉన్నట్లు తెలిసింది. గత నాలుగేళ్లుగా దంపతులు ఇద్దరు వేరువేరుగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దంపతులు కృష్ణకాంత్, లలిత కుమారి ఘర్షణపడ్డారు. మాటమాట పెరిగి భార్య లలిత కుమారి పదునైన ఆయుధంతో రిటైర్డ్ ప్రొఫెసర్ టి కృష్ణకాంత్ ను కొట్టి చంపినట్లుగా సమాచారం. కేయూ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోలీసుల దర్యాప్తులో కృష్ణకాంత్ హత్యకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. కేయూ పోలీసులు కృష్ణకాంత్ హత్యపై విచారణ జరుపుతున్నారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM