ఇనుప చక్రాలు బిగించిన ట్రాక్టర్లు రోడ్లపై నడుపొద్దు: సిఐ

byసూర్య | Sat, Aug 06, 2022, 12:51 PM

వర్ధన్నపేట నియోజకవర్గం లో ఇనుప చక్రాలు బిగించిన ట్రాక్టర్లు రహదారులపై నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం పర్వతగిరి సిఐ శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధి లోని అన్ని గ్రామాలలో పొలం దున్నే యంత్రాలతో రోడ్లపై, ట్రాక్టర్లను కేజీ వీల్స్ తో బీటీ రోడ్లు, సిసి రోడ్లపై నడపడం వల్ల రహదారులు ధ్వంసం అవుతున్నాయని, ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రహదారులు అనటి కాలంలోనే రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారవుతుందని, దాని వల్ల వాహనదారులు అదుపుతప్పి పడడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. రహదారులపై ఇనుప చక్రాలు బిగించిన ట్రాక్టర్లు నడపొద్దని ప్రభుత్వం నిబంధనలు విధించినప్పటికీ కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఇష్టా రాజ్యాంగా నడుపుతున్నారని, నిబంధనలు పాటించని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM