వివాహిత అదృశ్యం.. పోలీసులకు ఫిరియాదు

byసూర్య | Sat, Aug 06, 2022, 12:16 PM

సంగారెడ్డి జిల్లా రాయికొడ్ వివాహిత ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాయికోడ్ మండలంలోని సంగాపూర్ గ్రామానికి చెందిన ఆశంగారి గాల్ రెడ్డి కుమారుడు ఆశంగారి మోహన్ రెడ్డికి ఝరాసంగం మండలంలోని జోనగామ గ్రామానికి చెందిన చిట్యాపు నరసింహరెడ్డి కుమార్తె గాయత్రి(19)తో గత ఏడాది క్రితం పెళ్లి జరిగిందన్నారు. అప్పటినుండి వారి సంసారం సాఫీగా సాగిందన్నారు.


అంతలో ఏమి జరిగిందో ఏమో గానీ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతోపాటు గాయత్రి మేన మామ కాపు సంగారెడ్డితో కలిసి భోజనం చేసి నిద్రపోతున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త మోహన్ రెడ్డి లేచి చూడగా ఆమె కనిపించలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇంటి వద్ద వెతికినా గాయత్రి ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మోహన్ రెడ్డి తన భార్య కనిపించడం లేదని శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM