అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన ఎస్పీ

byసూర్య | Sat, Aug 06, 2022, 12:07 PM

అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను శ‌నివారం అరెస్ట్ చేసిన జిల్లా ఎస్‌పి రెమా రాజేశ్వరి ఐ‌పి‌ఎస్. ఎస్పీ మాట్లాడుతూ.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. వారి వద్ద నుండి (200) గంజాయి ప్యాకెట్‌లు ఒక్కొక్కటి 2 కేజీలు మొత్తం 400 కేజీల గంజాయి మొత్తం విలువ రూ. 12 లక్షలు, మూడు కార్లు, 5 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.


తెలంగాణ రాష్ట్ర డి. జి. పి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపడంతో పాటు నిరంతరం నిఘాలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ‌నివారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం సమన్వయంతో నల్గొండ హైవేపై వివిధ ప్రదేశాలలో డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహించి మూడు కార్లను ఎక్స్‌యూవీ 500, బాలెనో, స్విఫ్ట్ డిజైర్, నలుగురు గంజాయి స్మగ్లర్లను పట్టుకుని 200 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM