స్మార్ట్ సిటీగా కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్

byసూర్య | Sun, Jan 16, 2022, 10:29 PM

కరీంనగర్ స్మార్ట్ సిటీగా మారుతోందని స్థానిక మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులతో స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని ఆయన అన్నారు. కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్ధేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. రూ.12 కోట్లతో క్రీడ మైదానం ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రూ.కోటి 55 లక్షలతో రినోవేషన్ చేసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. త్వరలో స్కిల్ డెవలప్ బిల్డింగ్ భవనం పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో కరీంనగర్ టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అవుతుంది. నగరం మరింత డెవలప్ అవుతుంది. కరీంనగర్ రాష్ట్రంలో ఐదవ అతి పెద్ద నగరం. ఇది గోదావరి ఉపనది అయిన మానేర్ నది ఒడ్డున ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో మూడవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. తెలంగాణ ఉత్తర జిల్లాలకు ప్రధాన విద్యా, ఆరోగ్య కేంద్రంగా పనిచేస్తుంది. గ్రానైట్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందడంవల్ల దీనిని "సిటీ ఆఫ్ గ్రానైట్స్" అని కూడా పిలుస్తారు. నగరానికి సయ్యద్ కరీముద్దీన్ పేరు పెట్టారు. అతనిని స్థాపకుడిగా భావిస్తారు. పురాతన కాలము నుంచి వేద అభ్యాసన కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతానికి 'సబ్బినాడు' అనే పేరు ఉంది, కరీంనగర్, శ్రీశైలంలో లభించిన కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున ఈ నగరానికి కరినగరం అని పేరు వచ్చింది, కాలక్రమేణా కరీంనగర్ అని పిలువబడుతుందని మరికొందరు అంటుంటారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM