తెలంగాణ సీఎం కేసీఆర్ కిలక నిర్ణయం

byసూర్య | Sun, Jan 16, 2022, 10:30 PM

తెలంగాణ  సీఎం కేసీఆర్ కిలక నిర్ణయం తీసుకున్నారు.నలుగురు ఐఏఎస్ అధికారుల తో పరిపాలనా సంస్కరణల కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహించనున్నారు. సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ సభ్యులుగా ఉంటారు.కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాల్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని ఒత్తిడిని గుర్తించి కొత్త ఉద్యోగాల ఆవశ్యకతను అంచనా వేయడం ఈ కమిటీ పని. ఆయా ప్రభుత్వ శాఖలు పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక రూపొందించాల్సి ఉంది. వైద్య ఆరోగ్య, పురపాలక, విద్య, పంచాయతీరాజ్‌ వంటి కీలక శాఖల పనితీరు మెరుగుపరచడం, ఉద్యోగుల సేవల వినియోగం, మౌలిక వసతుల కల్పనపై తగిన సిఫార్సులు చేయాలని ఐఏఎస్‌ అధికారుల కమిటీని కేసీఆర్‌ ఆదేశించారు.


Latest News
 

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు Fri, Apr 19, 2024, 02:21 PM
రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM